TDR Bonds: తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీపై ఆరోపణలు... సీఐడీ సోదాలు

CID searches in Tirupati town planing dept
 
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీఆర్ బాండ్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై సీఐడీ విచారణకు తెరలేపింది. టీడీఆర్ బాండ్ల పేరిట భారీగా అవకతవకలు జరిగాయని టీడీపీ నేత రవినాయుడు ఫిర్యాదు చేయగా... రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, సీఐడీ అధికారులు నేడు తిరుపతి టౌన్ ప్లానింగ్ విభాగంలో సోదాలు చేపట్టారు. పైళ్లను పరిశీలించారు. 

తిరుపతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా 14 రోడ్ల నిర్మానానికి వైసీపీ పాలనలో భూసేకరణ చేపట్టారు. దీనికోసం అధికారులు రూ.2,500 కోట్ల టీడీఆర్ బాండ్లను జారీ చేశారు. ఈ బాండ్ల జారీలో వైసీపీ నేతలు భారీగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
TDR Bonds
Tirupati
CID
TDP
YSRCP

More Telugu News