Sadia Almas: క్రీడాకారిణి సాదియా అల్మాస్ కు మంత్రి నారా లోకేశ్ ఆర్థికసాయం

Nara Lokesh helps financially power lifter Sheikh Sadia Almas
 
రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి  సాదియా అల్మాస్ కు ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం చేశారు. ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరిట సాదియా అల్మాస్ కు లోకేశ్ రూ.3 లక్షల సాయం అందించారు. టీడీపీ నేతలు ఈ చెక్ ను సాదియాకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ కు సాదియా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. సాదియా గతంలో షార్జాలో జరిగిన ఏషియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించడం విశేషం. 

కాగా, సాదియా అక్క షేక్ ఆసియా కూడా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణే. ఆమె హాంకాంగ్ పోటీల్లో 4 స్వర్ణాలు సాధించింది. ఆసియా ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని నిమ్రా వైద్య కళాశాలలో హౌస్ సర్జన్ చేస్తోంది. తండ్రి శిక్షణలో సాదియా, ఆసియా పవర్ లిఫ్టర్లుగా రాణిస్తున్నారు.
Sadia Almas
Nara Lokesh
Power Lifter
Mangalagiri
TDP

More Telugu News