Manda Krishna Madiga: హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మందకృష్ణ మాదిగ

Mandakrishna Madiga meets AP CM Chandrababu
  • ఏపీ సీఎం నివాసంలో కలిసిన మందకృష్ణ
  • మందకృష్ణకు శాలువా కప్పి సత్కరించిన చంద్రబాబు
  • ఎస్సీ వర్గీకరణ తీర్పు అనంతరం నేతలను కలుస్తున్న మందకృష్ణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. హైదరాబాద్‌లోని ఏపీ సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మందకృష్ణకు శాలువా కప్పి చంద్రబాబు సత్కరించారు. ఇటీవల సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో మందకృష్ణ పలువురు ముఖ్య నేతలను కలుస్తున్నారు.

రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తదితరులు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఆయన రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
Manda Krishna Madiga
MRPS
Chandrababu
Andhra Pradesh

More Telugu News