కూకట్‌పల్లిలో నడిరోడ్డుపై రూ. 50 వేల విలువైన నోట్లు గాల్లోకి విసిరిన యూట్యూబర్ హర్ష.. ఏరుకునేందుకు ఎగబడిన జనం.. ట్రాఫిక్ జామ్.. వీడియో ఇదిగో!
- మున్ముందు మరింత డబ్బు వెదజల్లుతానంటూ వీడియో
- తన టెలిగ్రామ్ చానల్‌లో జాయిన్ అయి తాను ఎగరేయబోయే డబ్బును ఊహించి చెప్తే రివార్డులు ఇస్తానని ప్రకటన
- అతడిని అరెస్ట్ చేసి బుద్ధి చెప్పాలని నెటిజన్ల డిమాండ్
మరోవైపు, యూట్యూబర్ హర్ష మాత్రం ఇక్కడితో ఆగేది లేదని, ఇంకా ఇంకా డబ్బులు వెదజల్లుతానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, తన టెలిగ్రామ్ చానల్‌లో జాయిన్ అయి ఇకపై తాను గాల్లోకి ఎగరేయబోయే డబ్బులు ఎంతో ఊహించి రివార్డులు అందుకోవచ్చని కూడా పురికొల్పాడు.
నడిరోడ్డుపై ఇలాంటి ఘటనలు ప్రమాదాలకు కారణమవుతాయన్న ఆందోళన సర్వత్ర వ్యక్తమైంది. కాబట్టి యూట్యూబర్‌ను అరెస్ట్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే యూట్యూబర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.