Telangana: తెలంగాణలో పలు ప్రాంతాలకు సబ్ కలెక్టర్లుగా 2022 బ్యాచ్ ఐఏఎస్ ట్రైనీలు

2022 batch IAS trainees as sub collectors in Telangana
  • పలువురిని సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ
  • బాన్సువాడ సబ్ కలెక్టర్‌గా కిరణ్మయి కొప్పిశెట్టి
  • తాండూరు సబ్ కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్ నియామకం
తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాలకు సబ్ కలెక్టర్లుగా 2022 బ్యాచ్ ఐఏఎస్ ట్రైనీలను నియమించారు. ఈ మేరకు పలువురిని సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

కాగజ్ నగర్ సబ్ కలెక్టర్‌గా శ్రద్ధా శుక్లాను నియమించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్‌గా కిరణ్మయి కొప్పిశెట్టి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్‌గా నారాయణ్ అమిత్, బోధన్ సబ్ కలెక్టర్‌గా వికాస్ మహతో, తాండూరు సబ్ కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్, కాటారం సబ్ కలెక్టర్‌గా మయాంక్ సింగ్, ఉట్నూరు సబ్ కలెక్టర్‌గా ఎం.యువరాజ్‌ను నియమించారు.
Telangana
District Collector

More Telugu News