Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజున అదిరిపోయే ఫొటో పంచుకున్న రామ్ చరణ్

Ram Charan shares adorable photo on his father Chiranjeevi birthday
  • నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు
  • తండ్రితో కలిసున్న ఫొటో పంచుకున్న రామ్ చరణ్
  • ఇద్దరూ ఒకే తరహా దుస్తుల్లో కనువిందు
తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది అభిమానుల ఆరాధ్య హీరో మెగాస్టార్ చిరంజీవి వయసు పెరిగినా వన్నె తగ్గని రీతిలో ఇప్పటికీ భారీ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇవాళ (ఆగస్టు 22) చిరంజీవి 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 

ఈ సందర్భంగా ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అదిరిపోయే ఫొటో పంచుకున్నారు. పక్కా ట్రెడిషనల్ లుక్ లో ఉన్న చిరంజీవి, రామ్ చరణ్ లను ఆ ఫొటోలో చూడొచ్చు. 

అచ్చ తెలుగు సంప్రదాయం ప్రకారం పంచకట్టులో మెగాస్టార్, గ్లోబల్ స్టార్ మెరిసిపోతున్నారు. కళ్లకు కూలింగ్ గ్లాసులు, చేతికి డిజైనర్ వాచీలతో తండ్రీకొడుకులు చిరునవ్వుతో కెమెరాకు పోజులిచ్చారు. ఇద్దరూ ఒకే తరహా దుస్తుల్లో కనువిందు చేశారు.

ఇక, సినిమాల విషయానికొస్తే యువ దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర చిత్రంతో చిరంజీవి బిజీగా ఉండగా... శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ ఊపుమీదున్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్టులో నటించనున్నారు. ఇది స్పోర్ట్స్ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది.
Chiranjeevi
Birthday
Ram Charan
Photo
Megastar
Global Star

More Telugu News