Dwarampudi Chandrasekhar Reddy: ఎమ్మెల్యే కొండబాబుకు ద్వారంపూడి బహిరంగలేఖ

Dwarampudi open letter to MLA Kondababu
  • తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న ద్వారంపూడి
  • రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శ
  • తాను బియ్యం వ్యాపారం చేయడం లేదని వ్యాఖ్య
కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకు వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కక్ష సాధింపుల్లో భాగంగానే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అధికారం ఉందనే అహంకారంతో వ్యవహరించడం సరికాదని అన్నారు. 

తనపై పెడుతున్న కేసులను చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను ఎలాంటి బియ్యం వ్యాపారం చేయడం లేదని... మీ కారణంగా 30 వేల మంది కార్మికులు నష్టపోతున్నారని విమర్శించారు. అధికారుల బదిలీల్లో జరిగిన అక్రమాలను బయటపెడతానని హెచ్చరించారు. ఆరు నెలల తర్వాత అవినీతి అక్రమాలపై స్పందిస్తానని చెప్పారు. కొండబాబుకు ద్వారంపూడి రాసిన బహిరంగలేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Dwarampudi Chandrasekhar Reddy
YSRCP
Kondababu

More Telugu News