Chandrababu: పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష... హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

CM Chandrababu reviews on Panchayat Raj and Rural Development
  • సచివాలయంలో సమీక్ష సమావేశం
  • పంచాయతీలకు స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ వ్యయం పెంపు
  • గ్రామీణ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక యాప్
  • ఈ నెల 23న గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు సీఎంకు వివరించిన పవన్
సీఎం చంద్రబాబు నేడు పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

గ్రామ పంచాయతీలకు స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వ్యయం పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. వేడుకల వ్యయాన్ని రూ.10 వేల నుంచి 25 వేలకు పెంచినట్టు సమీక్షలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకువచ్చారు. మొబైల్ యాప్ రూపొందించి, గ్రామీణ పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హత నిబంధన ఎత్తివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీనిపై కేబినెట్ లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించినట్టు తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపు అంశం కూడా నేటి సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. 

ఇక, ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు వివరించారు. 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
Chandrababu
Panchayat Raj and Rural Development
Review
Pawan Kalyan
TDP-JanaSena-BJP Alliance

More Telugu News