Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. బైక్‌తో కొట్టుకుపోయిన యువకుడు.. రక్షించేందుకు వెళ్లిన యువకుడు కూడా.. వీడియో ఇదిగో!

Young man washed away in rain water with his bike in Hyderabad
  • హైదరాబాద్‌లో కుండపోత వాన
  • ఇందిరానగర్‌లో స్కూటర్‌తో వెళ్తూ కిందపడి కొట్టుకుపోయిన యువకుడు
  • జీహెచ్ఎంసీ పరిధిలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి ఇందిరానగర్‌లో స్కూటర్‌పై వెళ్తున్న ఓ యువకుడు కొట్టుకుపోయాడు. వర్షపు నీరు వేగంగా ప్రవహిస్తున్నప్పటికీ యువకుడు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కొద్దిదూరం వెళ్లగానే స్కూటర్ అదుపు తప్పి కిందపడింది. వాహనంపై చిక్కుకుపోయిన అతడు అలానే కొట్టుకుపోయాడు.

అది గమనించిన ఇద్దరు కుర్రాళ్లు రక్షించేందుకు వెళ్లగా, వారిలో ఒకరు కూడా కొట్టుకుపోయారు. రెండుమూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులు కూడా చెరువులను తలపిస్తుండగా, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపథ్యంలో నేడు జీహెచ్ఎంసీ పరిధిలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
Hyderabad
Heavy Rains
Indira Nagar

More Telugu News