Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఏ గ్రామ సభలో పాల్గొంటారంటే ..!

ap dy cm pawan kalyan to participate in annamayya dist gram sabha
  • 23న రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో గ్రామ సభలు
  • అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరివారిపాలెం గ్రామసభలో పాల్గొననున్న   పవన్  
  • పవన్ పర్యటన ఖరారుతో ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా  ఈ నెల 23వ తేదీన గ్రామ సభలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒకే రోజున 13326 పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గ్రామ సభల నిర్వహణపై జిల్లా పరిషత్ సీఈవోలు, డీపీఓలు, డ్వామా పీడీలు, ఎంపీడీఓలతో డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు.

కాగా, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో జరిగే గ్రామ సభకు హజరు అవ్వనున్నారు. ఈ నెల 23న రైల్వే కోడూరు మండలం మైసూరివారిపల్లె గ్రామ సభలో డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు. మైడల్ పంచాయతీగా నిలిచినందున మైసూరివారిపల్లెలో నిర్వహించే గ్రామ సభలో డిప్యూటి సీఎం పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Pawan Kalyan
annamaiah dist
grama sabha

More Telugu News