AP High Court: హైకోర్టును ఆశ్రయించిన దువ్వాడ శ్రీనివాస్ .. పోలీసులకు నోటీసులు

ap high court hearing ycp mlc duvvada srinivas petition
  • దువ్వాడ శ్రీనివాస్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
  • పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు 
  • తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయతీ హైకోర్టుకు చేరింది. దువ్వాడ కుటుంబ పంచాయతీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్ గా మారింది. ఓ పక్క శ్రీనివాస్ భార్య వాణి న్యాయపోరాట దీక్ష కొనసాగిస్తుండగా, శ్రీనివాస్ .. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.  భార్య వాణి, కుమార్తె హైందవి ఇంటిపైకి వచ్చి వివాదం చేస్తున్నారని, వారిపై నమోదు చేసిన కేసులో టెక్కలి పోలీసులు దర్యాప్తు చేయడం లేదని కోర్టుకు విన్నవిస్తూ .. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని దువ్వాడ శ్రీనివాస్ కోరాడు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి .. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. 
 
ముందుగా పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు అయిదు రోజుల క్రితమే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిందితులు వాణి, హైందవిలకు సెక్షన్ 41(ఏ) నోటీసులు ఇచ్చి విచారణ కోరారని చెప్పారు. మరో పక్క దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన అర్ధాంగి వాణి సైతం ఫిర్యాదు చేశారని, పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.
AP High Court
YSRCP
duvvada srinivas

More Telugu News