Venigandla Ramu: అమెరికాలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ఎన్నారైల ఘన స్వాగతం

NRIs Grand Welcome to TDP MLA Venigandla Ramu in Atlanta
  • 100 కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వ‌హించిన ఎన్నారైలు
  • డౌన్ టౌన్ పార్కు నుంచి అలెగ్జాండర్ డ్రైవ్ అల్ఫారెట్టా వరకు విజయోత్సవ ర్యాలీ
  • కుటుంబ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఎమ్మెల్యే
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు అమెరికాలో ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా 100 కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వ‌హించ‌డం విశేషం. కుటుంబ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయ‌న‌కు ఇలా ఘ‌న స్వాగ‌తం ద‌క్కింది. 

అట్లాంట విమానాశ్ర‌యంకు తెలుగు అసోసియేషన్ సభ్యులు భారీగా చేరుకుని రామును అభినందించారు. ఆ త‌ర్వాత‌ డౌన్ టౌన్ పార్కు నుంచి అలెగ్జాండర్ డ్రైవ్ అల్ఫారెట్టా వరకు టీడీపీ జెండాలతో ఎన్నారైలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. 

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రాముకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం పూల మాలలు వేసి జ్ఞాపికలు అంద‌జేశారు. ఇక ఈ భారీ ర్యాలీ త‌ర్వాత తెలుగు ప్ర‌వాసులు టపాసులు కాలుస్తూ సందడి చేశారు. 

అనంతరం ఎన్నారైలు విజయోత్సవ కేక్ ను ఆయ‌న‌తో కట్ చేయించారు. కాగా, ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కీల‌క నేత కొడాలి నానిపై వెనిగండ్ల రాము భారీ మెజారిటీతో గెలిచిన విష‌యం తెలిసిందే.
Venigandla Ramu
TDP MLA
Atlanta
Andhra Pradesh

More Telugu News