Hyderabad: హైద‌రాబాద్‌లో దంచికొడుతున్న వాన‌!

Heavy Rain in Hyderabad
హైద‌రాబాద్‌లో కుండ‌పోత వ‌ర్షం కురుస్తోంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. న‌గ‌రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అబిడ్స్‌, నాంప‌ల్లి, నాగోల్‌, అంబ‌ర్ పేట్‌, అబ్దుల్లాపూర్‌మేట్, జీడిమెట్ల‌, సూరారం, సుచిత్ర‌, బషీర్ బాగ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట, మెహదీపట్నం, హిమాయత్ నగర్, దిల్‌సుఖ్ నగర్, మలక్ పేట, వనస్థలిపురం, ఉప్పల్, ఫిల్మ్ నగర్, నారాయణగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఎర్రమంజిల్, లక్డికాపుల్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది.

అలాగే బీఎన్ రెడ్డి న‌గ‌ర్‌, హ‌య‌త్ న‌గ‌ర్‌, జ‌గ‌ద్గిరిగుట్ట‌, బ‌హ‌దూర్ ప‌ల్లి, గుండ్ల‌పోచం ప‌ల్లి, పేట్ బ‌షీరాబాద్‌లోనూ వాన దంచికోడుతోంది. దీంతో రోడ్లు మెుత్తం పూర్తిగా జలమయం అయ్యాయి. దాంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్ర‌జ‌లు అవసరం అయితేనే ఇళ్ల‌ నుంచి బయటకు రావాలని సూచించారు. అలాగే ఉద‌యం కార్యాల‌యాల‌కు వెళ్లే ఉద్యోగులు కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరారు.
Hyderabad
Heavy Rain
Telangana

More Telugu News