Chandrababu: నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

Chandrababu visiting Tirupati and Nellore districts today
  • సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్న చంద్రబాబు
  • ఈ మధ్యాహ్నం శ్రీసిటీలో పర్యటన
  • 15 సంస్థల కార్యకలాపాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్నారు. జలాశయ మరమ్మతు పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం రాంనారాయణరెడ్డి పాల్గొంటారు. 

అనంతరం ఈ మధ్యాహ్నం సత్యవేడులోని శ్రీసిటీలో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలను చంద్రబాబు ప్రారంభిస్తారు. రూ. 900 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2,740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో 1,213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి నాలుగు ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అనంతరం పలు కంపెనీల సీఈఓలతో చంద్రబాబు భేటీ అవుతారు.
Chandrababu
Telugudesam
Tirupati
Nellore

More Telugu News