CM Chandrababu: నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు: చంద్రబాబు

CM Chandrababu wishes happy raksha bandhan to all Telugu ladies
  • తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి అన్న ఏపీ సీఎం
  • మహిళల అభ్యున్నతకి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చామన్న చంద్రబాబు
  • సోషల్ మీడియా వేదికగా రాఖీ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
దేశవ్యాప్తంగా రక్షా బంధన్ సందడి నెలకొంది. రక్తం పంచుకుపుట్టిన సోదరులు, సోదర భావాన్ని పంచుకుంటున్నవారికి రాఖీలు కట్టేందుకు అక్కాచెల్లెమ్మలు సిద్ధమయ్యారు. ఇక సోషల్ మీడియా వేదికగా రక్షా బంధన్ శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

చంద్రబాబు శుభాకాంక్షలు ఇవే..
‘‘ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళల పేరు పైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే. మహిళా సాధికారత కోసం ‘డ్వాక్రా’ సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషిచేశాం. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటిస్తూ... ఈ ‘రక్షాబంధన్’ సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అన్నివేళలా, అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
CM Chandrababu
Raksha bandhan
Andhra Pradesh
Telugudesam

More Telugu News