Crime News: పనిచేస్తున్న జువెలర్స్ షాపులో ఆభరణాల చోరీ.. తాకట్టుపెట్టి ప్రియురాలితో కలిసి ఆలయాల సందర్శన

Man theft gold ornaments for girlfriend in Hyderabad
  • హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఘటన
  • శ్రీసిద్ధి వినాయక జువెలర్స్‌లో 8 ఏళ్లుగా పనిచేస్తున్న నిందితుడు
  • చెప్పాపెట్టకుండా మానేయడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం
  • 28 గ్రాముల ఆభరణాలు, 8 గ్రాముల వజ్రాల నెక్లెస్ చోరీ
  • ప్రియురాలితో కలిసి జల్సాలు
చేసిన పాపం ఆలయాల చుట్టూ తిరిగితే పోతుందనుకున్నాడో ఏమో! ప్రియురాలితో కలిసి ఆలయాల బాట పట్టాడు. చివరికి దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. హైదరాబాద్ బషీర్‌బాగ్ చంద్రనగర్‌కు చెందిన మర్రి సాయిలక్ష్మణ్ 8 సంవత్సరాలుగా బషీర్‌బాగ్‌లోని శ్రీ సిద్ధి వినాయక జ్యువెలర్స్‌ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నాడు. రెండు నెలల నుంచి చెప్పాపెట్టకుండా మానేశాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. దీంతో అనుమానించిన యాజమాన్యం దుకాణంలో ఆడిట్ నిర్వహించి 28 గ్రాముల బంగారం కనిపించకుండా పోయినట్టు గుర్తించింది.

శ్రీ సిద్ధి వినాయక జువెలర్స్ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు చెప్పింది విని విస్తుపోయారు. కనిపించకుండా పోయిన 28 గ్రాముల బంగారంతోపాటు 8 గ్రాముల డైమండ్ నెక్లెస్‌ను కూడా దొంగిలించినట్టు అంగీకరించాడు. వాటిలో కొన్నింటిని మణప్పురం గోల్డ్‌లోన్‌ కంపెనీలో తాకట్టు పెట్టి గాళ్ ఫ్రెండ్‌తో కలిసి ఆలయాలు సందర్శించినట్టు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. అతడి నుంచి 3 గ్రాముల బంగారంతోపాటు తాకట్టు పెట్టిన డైమండ్ నెక్లెస్‌ను రికవరీ చేశారు.
Crime News
Basheerbagh
Jewellers
Hyderabad

More Telugu News