Hyderabad: కొనసాగుతున్న ఆవర్తనం, ద్రోణి...  హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం

Heavy rain lashes Hyderbad today
  • హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో వర్షం
  • రోడ్లు జలమయం
  • పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో గత కొన్నిరోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాదు నగరాన్ని ఇవాళ కూడా వర్షం ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండడంతో, పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరింది. దాంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. వాహనదారులు అవస్తలు పడుతున్నారు. 

ఉప్పల్, హయత్ నగర్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, తార్నాక, కోఠి, సోమాజిగూడ, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం కావడంతో ఎల్బీనగర్-చాదర్ ఘాట్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Hyderabad
Heavy Rain
City
Traffic

More Telugu News