Fire Accident: టీటీడీ పరిపాలనా భవనంలో అగ్నిప్రమాదం

Fire accident in TTD Administration office in Tirupati
 
తిరుమల  తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలు ఫైళ్లు దగ్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.  అసిస్టెంట్ ఇంజినీర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే మంటలను టీటీడీ సిబ్బంది ఆర్పివేశారు. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులోని ఇంజినీరింగ్ విభాగంలో ఈ మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సెక్షన్ ను చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్ పరిశీలించారు. 
Fire Accident
TTD
Tirupati
Tirumala

More Telugu News