RTC Bus: బస్సు రన్నింగ్‌లో ఉండగా ఊడిన వెనుక చక్రాలు

Jagtial bus narrowly misses accident
  • జగిత్యాల నుంచి నిర్మల్‌కు వెళుతున్న పల్లె వెలుగు బస్సు
  • మొరపల్లి గ్రామాకి చేరుకున్న సమయంలో ఊడిపోయిన చక్రాలు
  • డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ముప్పు
జగిత్యాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పరిమితికి మించి ప్రయాణికులు ఉన్న ఓ ఆర్టీసీ బస్సు నడుస్తున్న సమయంలోనే వెనుక చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. పల్లె వెలుగు బస్సు ఒకటి జగిత్యాల నుంచి నిర్మల్‌కు వెళుతోంది. జగిత్యాల శివారు మొరపల్లి గ్రామానికి చేరుకున్న సమయంలో బస్సు వెనుక రెండు చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంతో వెంటనే బస్సును నిలిపివేశారు.

ఈ ప్రమాదానికి గురైనప్పుడు బస్సులో భారీ సంఖ్యలో ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సెలవులకు తోడు ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండటంతో చాలా బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు.
RTC Bus
Telangana

More Telugu News