హయత్ నగర్ వద్ద జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
రహదారిపై గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలకు వెళ్లే విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రహదారిపై బోల్తా కొట్టిన ట్రక్ ను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్దరించారు.