Ayyanna Patrudu: తిరుమల అన్నదాన సత్రంలో అన్నప్రసాదం స్వీకరించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

AP Assembly speaker Ayyanna Patrudu visits Tirumala
ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల విచ్చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం ఇక్కడి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. సాధారణ భక్తులతో కలిసి భోజనం చేశారు. ఈ వివరాలను అయ్యన్నపాత్రుడు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. తిరుమల సందర్శనకు సంబంధించిన ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు.
Ayyanna Patrudu
Tirumala
Anna Prasadam
TDP-JanaSena-BJP Alliance

More Telugu News