Natasa Stankovic: హార్దిక్ పాండ్యా-జాస్మిన్ వాలియా డేటింగ్ వార్తల వేళ.. ఫొటోలతో అభిమానులకు ట్రీట్ ఇచ్చిన మాజీ భార్య నటాషా

Natasa Stankovic Stuns Fans With Latest Photo Shoot
  • గ్రీన్ అవుట్‌ఫిట్ వన్ షోల్డర్ డ్రెస్‌తో నటాషా ఫొటో షూట్
  • ‘హౌ ఈజ్ ద వ్యూ’ అంటూ వాటికి క్యాప్షన్
  • ఆమెకు మద్దతుగా కామెంట్లతో హోరెత్తిస్తున్న నటాషా ఫ్యాన్స్
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. బ్రిటిష్ సింగర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జాస్మిన్ వాలియా మధ్య ఏదో నడుస్తోందని, వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు హోరెత్తుతున్న వేళ నటాషా స్టాంకోవిచ్ తన ఫొటోలతో అభిమానులకు పసందైన విందు పంచుతోంది. ఆమె తాజా ఫొటోషూట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. మోడల్, నటి అయిన నటాషా ఇటీవలే పాండ్యాతో విడాకులు తీసుకుంది.

గ్రీన్ అవుట్‌ఫిట్‌తో వన్ షోల్డర్ డ్రెస్, కళ్లకు సన్ గ్లాసెస్ ధరించిన ఆమె ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ‘హౌ ఈజ్ ద వ్యూ’ అంటూ ఆ ఫొటోలకు నటాషా క్యాప్షన్ తగిలించింది. ఆ ఫొట్లో ఆమె పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించింది. పాండ్యా-జాస్మిన్ దగ్గరైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ నటాషా మరోమారు స్పాట్‌లైట్‌లోకి రావడం గమనార్హం.

నటాషా ఫొటోలపై ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ కష్ట సమయంలో ఆమెకు వెన్నంటి ఉంటామని హామీ ఇస్తున్నారు. కొందరు ఆమెను లక్ష్యంగా చేసుకుని ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినప్పటికీ నటాషా మాత్రం మౌనంగానే ఉంటూ హుందాతనాన్ని చాటుకుందని మరికొందరు ప్రశంసించారు. ఇంటర్నెట్ ఆమెకు క్షమాపణలు చెప్పాలని మరో అభిమాని డిమాండ్ చేశాడు.
Natasa Stankovic
Hardik Pandya
Jasmin Walia
Crime News

More Telugu News