Kodandaram: ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం

Kodandaram takes oath as MLC
  • గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అలీ ఖాన్
  • ఇద్దరి చేత ప్రమాణస్వీకారం చేయించిన మండలి ఛైర్మన్
  • హాజరైన మంత్రులు పొన్నం, పొంగులేటి
ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ ఆమిర్ అలీఖాన్ లు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరిచేత ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్, విప్ బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరామ్, అలీఖాన్ లకు పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
Kodandaram
MLC
Gutha Sukender Reddy

More Telugu News