Palla Rajeshwar Reddy: ఉదయం నుంచి రేవంత్ రెడ్డి అన్నిచోట్లా బూతులే మాట్లాడుతున్నారు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla Rajeshwar Reddy blames Revanth Reddy for his comments
  • సీఎం అబద్ధాలు చెబుతుంటే అధికారులు కూడా సిగ్గుపడుతున్నారని వ్యాఖ్య
  • ఇంత దారుణంగా మాట్లాడే సీఎం దేశంలోనే లేరన్న ఎమ్మెల్యే
  • రుణమాఫీ, ఉద్యోగాలపై కాంగ్రెస్ నేతలవి పచ్చి అబద్ధాలన్న రాజేశ్వర్ రెడ్డి
రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం నుంచి అన్నిచోట్లా బూతులే మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. సీఎం అబద్ధాలు చెబుతుంటే అధికారులు కూడా సిగ్గుపడుతున్నారన్నారు. పల్లా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి భాష చూసి అందరూ తలదించుకుంటున్నారన్నారు. ఇంత దారుణంగా మాట్లాడే ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరూ లేరన్నారు. ఆయన తెలంగాణకు పట్టిన పీడ, చీడ అన్నారు.

నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టుపై రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.7,400 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 10 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. 30 వేల ఉద్యోగాలపై కూడా కాంగ్రెస్ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.

రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రుణమాఫీకి రూ.40 వేల కోట్లు కావాలని మొదట చెప్పారని, ఆ తర్వాత రూ.31 వేల కోట్లు అన్నారని, కానీ తీరా రైతుల ఖాతాల్లో వేసింది మాత్రం రూ.17 వేల కోట్లు మాత్రమే అన్నారు. రేవంత్ రెడ్డి మెడలు వంచి రుణమాఫీ చేయించిన ఘనత హరీశ్ రావుదే అన్నారు. రేవంత్ రెడ్డి భాషను పశువులు కూడా సహించవన్నారు. ఆయనలా మాట్లాడేందుకు తమకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు.
Palla Rajeshwar Reddy
Telangana
Revanth Reddy
BRS

More Telugu News