Karnataka: భార్య అందంగా తయారవుతోందని.. స్నేహితులతో కలిసి మట్టుబెట్టాడు

Husband killed wife with the help of his friends in Karnataka
  • కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో ఘటన
  • భార్య అందంగా తయారు కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన భర్త
  • విడాకులకు దరఖాస్తు చేసిన భార్య
  • కోర్టు నుంచి నమ్మించి తీసుకెళ్లి హత్య
అందంగా తయారవుతున్న భార్యను చూసి ఓర్చుకోలేని భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో జరిగిందీ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

పోలీసుల కథనం ప్రకారం..  32 ఏళ్ల దివ్య-ఉమేశ్ భార్యాభర్తలు. అందంగా కనిపించాలన్న తపనతో దివ్య రోజూ తయారయ్యేది. పెదవులకు లిప్‌స్టిక్ వేసుకునేది. ఒంటిపై టాటూ కూడా పొడిపించుకుంది. అయితే, అందంగా కనిపించాలన్న భార్య ఆరాటం ఉమేశ్‌కి నచ్చేది కాదు. అనుమానిస్తూ పలుమార్లు ఇదే విషయమై ఆమెతో గొడవ పడ్డాడు. భర్త తనను అనుమానిస్తూ, వేధిస్తుండడాన్ని సహించలేకపోయిన దివ్య ఇక లాభం లేదని విడాకులకు దరఖాస్తు చేసుకుంది.

మంగళవారం ఇద్దరూ కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత తాను మారిపోయానని, ఇకపై అనుమానించబోనంటూ భార్యను నమ్మించాడు. భర్త మాటలు నమ్మిన దివ్య.. ఉమేశ్ వెంట వెళ్లింది. అక్కడి నుంచి ఆమెను ఊజగల్లు దేవాలయానికి తీసుకెళ్లిన ఉమేశ్.. దర్శనం అనంతరం సమీపంలోని కొండవద్దకు తీసుకెళ్లాడు. ముందస్తు ప్లాన్‌లో భాగంగా అప్పటికే అక్కడ నలుగురు స్నేహితులను ఉంచిన ఉమేశ్.. వారితో కలిసి దివ్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి చీలూరు అటవీ ప్రాంతంలో పడేశారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడైన ఉమేశ్ కోసం గాలిస్తున్నారు.
Karnataka
Crime News
Ramanagara District

More Telugu News