ఎర్ర‌కోట‌పై జాతీయ‌జెండాను ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోదీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎర్ర‌కోట‌పై జాతీయ‌జెండాను ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోదీ

PM Narendra Modi Unveils National Flag at Red Fort Delhi
78వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై వ‌రుస‌గా  11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర‌మంత్రుల‌తో పాటు సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు హాజ‌ర‌య్య‌రు. అలాగే జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా భార‌త సైన్యం హెలికాప్ట‌ర్ల‌తో పూలవ‌ర్షం కురిపించింది.  

2047 వికసిత్‌ థీమ్‌తో ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలు జరుగుతున్నాయి. భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ వేడుకలు పునరుత్తేజాన్ని అందించ‌నున్నాయి.
Advertisement
PM Narendra Modi
National Flag
Red Fort
Independence Day

More Telugu News