Rohit Sharma: ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండోస్థానానికి రోహిత్

Rohit Sharma climbed to second spot in ICC ODI batting rankings
 
టీమిండియా వన్డే జట్టు సారథి రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి ఎగబాకాడు. ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇటీవల శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ఆడిన రోహిత్ శర్మ, ఆ సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 52.33 సగటుతో 157 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. తద్వారా ఒక స్థానం మెరుగుపర్చుకుని రెండో ర్యాంకులో నిలిచాడు. 

అదే సమయంలో, టీమిండియా యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో మార్పులేదు. ఐర్లాండ్ నయా సంచలనం హ్యారీ టెక్టర్ తో కలిసి కోహ్లీ నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నాడు. 

ఈ ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.
Rohit Sharma
Rankings
Batting
ODI
ICC
Team India

More Telugu News