Telangana: రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం సాధించిన యాదయ్యను సన్మానించిన డీజీపీ

DGP felicitated madapur CCS Head Constable Chaduvu Yadayaiya
  • సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్‌కు రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం
  • యాదయ్యను సన్మానించిన డీజీపీ జితేందర్
  • తెలంగాణకు యాదయ్య గర్వకారణమంటూ ట్వీట్
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీస్ పతకం అందుకోనున్న తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యను డీజీపీ జితేందర్ సన్మానించారు. యాదయ్య మాదాపూర్ సీసీఎస్‌లో పనిచేస్తున్నారు. డీజీపీ, ఐజీలు విజయ్ కుమార్, రమేశ్... ఆయనను అభినందించి, శాలువాతో సత్కరించారు. 

ఇందుకు సంబంధించిన ఫొటోలను అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా 'తెలంగాణ పోలీస్' షేర్ చేసింది. "ఒక నేరస్తుడ్ని పట్టుకునేప్పుడు ఏడుసార్లు కత్తిపోట్లకు గురైనా, రక్తమోడుతున్నా ధైర్యసాహసాలు ప్రదర్శించి రాష్ట్రపతి శౌర్య పురస్కారానికి ఎంపికైన ఏకైక పోలీస్ అధికారిగా నిలిచి తెలంగాణకు గర్వకారణమైన హెడ్‌కానిస్టేబుల్ శ్రీ చదువు యాదయ్యని డీజీపీ జితేందర్ ప్రత్యేకంగా సన్మానించారు" అంటూ ట్వీట్ చేసింది.
Telangana
TS DGP
President Of India

More Telugu News