Independence Day 2024: భారత్, పాక్ విభజన సమయంలో ఆస్తుల పంపకాల లెక్కలు ఇవే!.. టాస్ ద్వారా గుర్రపు బండి కేటాయింపు

this is data of historic division of assets and military between India and Pakistan
  • బ్రిటీష్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ పర్యవేక్షణ జరిగిన పంపకాలు
  • నాటి ఖజనాలో భారత్‌కు రూ.400 కోట్లు, పాక్‌కు రూ.75 కోట్లు పంపిణీ
  • మిలిటరీ, జంతువులు కూడా విభజన
దాయాది దేశం పాకిస్థాన్ నేడు (బుధవారం) స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇక భారత్ రేపు (గురువారం, ఆగస్టు 15) 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు ముస్తాబు అయింది. ఎందరో మహానుభావుల పోరాట ఫలితంగా దాదాపు 200 ఏళ్ల సుదీర్ఘ బ్రిటీష్ పాలన నుంచి 1947లో విముక్తి లభించింది.

అయితే నాడు భారత్, పాకిస్థాన్‌గా విభజన జరగడం తెలిసిందే. ఆ సమయంలో ఇరుదేశాల మధ్య ఆస్తుల పంపకాలు జరిగాయి.  ఆస్తుల నుంచి సైన్యం వరకు, ఆర్థిక కేటాయింపుల నుంచి జంతువులు, వాహనాల వరకు అన్ని విభాగాల్లోనూ పంపకాలు జరిగాయి. బ్రిటీష్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ పర్యవేక్షణలో పంపకాలు జరిగాయి. భౌగోళిక విభజన త్వరగా, సులభంగానే పూర్తయింది. అయితే సైనిక ఆస్తులు, సంపద విభజన మాత్రం చాలా ఇబ్బందుల మధ్య పూర్తయింది.

భారత్‌కు రూ.400 కోట్లు..
విభజన ఒప్పందం ప్రకారం బ్రిటీష్ ఇండియా ఆస్తులు, అప్పులలో పాకిస్థాన్‌కు 17 శాతానికి పైగా కేటాయింపులు చేశారు. దీంతో నాటి ఖజనాలో భారత్‌కు దాదాపు రూ. 400 కోట్లు, పాకిస్థాన్‌కు రూ. 75 కోట్లు పంపిణీ చేశారు. అయితే పాకిస్థాన్‌కు అదనంగా మరో రూ. 20 కోట్లను వర్కింగ్ క్యాపిటల్‌గా అందజేశారు. 

ఇక. ఇరు దేశాలు అప్పటికే ఉన్న నాణేలు, కరెన్సీని 1948 మార్చి 31 వరకు ఉమ్మడిగా చలామణీ చేసుకునేందుకు విభజన మండలి నిర్ణయించింది. పాకిస్థాన్ తన కొత్త కరెన్సీని 1948 ఏప్రిల్ 1 - సెప్టెంబరు 30 మధ్య కాలంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవకాశం కల్పించారు. 

చరాస్తుల విభజన జరిగిందిలా...
భారత్, పాకిస్థాన్ మధ్య 80:20 నిష్పత్తిలో చరాస్తులను విభజించినట్లు నాటి రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. పురావస్తు కళాఖండాలను కూడా పంపకం చేశారు. జంతువులను కూడా పంపకాలు చేశారు. ‘జాయ్ మోని’ ఏనుగు నాటి తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)కి వెళ్లింది.  పశ్చిమ బెంగాల్ కు ఓ కారు లభించింది. ఇక అత్యంత ఆసక్తికరంగా బంగారు పూత పూసిన గుర్రపు బండిపై నాడు వివాదం తలెత్తింది. అయితే చివరికి కాయిన్ టాస్ నిర్ణయించారు. టాస్‌లో భారత్ గెలవడంతో ఆ గుర్రపు బండి భారత్‌కు దక్కింది.
Independence Day 2024
India
Pakistan
Off Beat News
Viral News

More Telugu News