Pawan Kalyan: మరీ ఇంత తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలా?: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశ్చర్యం

Should a rocket be launched at such a low cost Deputy CM Pawan Kalyan is surprised
  • శ్రీహరికోట సందర్శనతో తన చిన్న నాటి కల నెరవేరిందన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • బాలీవుడ్ సినిమాలకు అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలు చేయడం ప్రశంసనీయం అన్న పవన్ కల్యాణ్  
  • సైంటిస్టులు రియల్ హీరోలు అంటూ ప్రశంస 
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మొట్టమొదటి సారిగా తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా షార్ డైరెక్టర్ రాజరాజన్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజరాజన్ ఆయనకు చంద్రయాన్ – 3 రాకెట్ ప్రయోగ నమూనాను బహూకరించారు.
 
స్పేస్ సెంటర్ లో జరిగిన జాతీయ అంతరిక్ష ఉత్సవాల్లో పాల్గొన్న పవన్ .. రాకెట్ ప్రయోగాలకు అవుతున్న ఖర్చును శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. బాలీవుడ్ సినిమాకు అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలు చేస్తుండటంపై పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇంతటి తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలు చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు రియల్ హీరోలు అంటూ ప్రశంసించారు. రాకెట్ ప్రయోగాలు చేసే సైంటిస్టులు కనిపించని దేవుళ్లు అని అన్నారు. విద్యార్ధులు, యువత సైంటిస్ట్ లను ఆదర్శంగా తీసుకుని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని సూచించారు.
 
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైంటిస్ట్ లకు తోడ్పాటు అందిస్తూ అండగా ఉండటంతో ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయన్నారు. శ్రీహరికోట సందర్శనతో తన చిన్న నాటి కల నెరవేరిందని పవన్ అన్నారు. అనంతరం అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్ధులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు బహూకరించారు.
Pawan Kalyan
Deputy Chief minister
Andhra Pradesh
sriharikota

More Telugu News