Hamas: ఎం90 రాకెట్లతో ఇజ్రాయెల్ రాజధానిపై దాడి చేసిన హమాస్

Hamas said that Israeli city of Tel Aviv and its suburbs attacked with two M90 rockets
  • టెల్ అవీవ్, నగర శివారు ప్రాంతంపై దాడి చేసినట్టు హమాస్ ప్రకటన
  • ఒక రాకెట్ సముద్ర తలంలో, మరొకటి తమ భూభాగంలోకి రాలేదన్న ఇజ్రాయెల్ వైమానిక దళం
  • పేలుడు శబ్దాలు వినిపించాయంటున్న ఇజ్రాయెల్ మీడియా
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ కీలక పరిణామం జరిగింది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ రాకెట్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్, దాని శివారు ప్రాంతం లక్ష్యంగా రెండు ‘ఎం90’ రాకెట్లతో దాడి చేశామని హమాస్‌కు చెందిన సాయుధ అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ మంగళవారం ప్రకటించింది. 

ఈ పరిణామంపై ఇజ్రాయెల్ వైమానిక దళం కూడా స్పందించింది. కొద్దిసేపటి క్రితం గాజా స్ట్రిప్‌ భూభాగాన్ని దాటి దేశం మధ్యలో ఉన్న సముద్ర తలంలో పడేలా జరిగిన ఒక రాకెట్ ప్రయోగాన్ని గుర్తించామని ప్రకటించింది. మరొక రాకెట్ ఇజ్రాయెల్ భూభాగంలోకి రాలేదని తెలిపింది. అయితే విధానపరమైన ఎలాంటి హెచ్చరికలు తలెత్తలేదని ఇజ్రాయెల్ వైమానిక దళం స్పష్టం చేసింది. 

మరోవైపు ఇజ్రాయెల్ మీడియా కూడా పేలుడు శబ్దాలు వినిపించాయని చెబుతోంది. టెల్ అవీవ్‌ నగరంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, అయితే ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Hamas
Israel
Tel Aviv
M90 rockets

More Telugu News