Suicide Case: వివాహిత ఆత్మహత్య కేసు .. భర్త, అత్త, ఆడపడుచుకు యావజ్జీవ శిక్ష

Court Awards Life Punishment For Three In Woman Suicide Case
  • వరకట్న వేధింపులు తాళలేక రంగారెడ్డి జిల్లాలో సునీత ఆత్మహత్య
  • నిందితులను దోషులుగా తేల్చి యావజ్జీవశిక్ష విధించిన న్యాయస్థానం
  • మూడేళ్లలోనే తీర్పు
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న కేసులో రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకి వెళ్తే... తలకొండపల్లి మండలం పూల్‌సింగ్‌తండాకు చెందిన పత్లావత్ సురేందర్‌కు సునీతతో వివాహమైంది. వరకట్నంగా సునీత తల్లిదండ్రులు రూ.5లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. సురేందర్-సునీత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

వివాహం అయిన రెండేళ్ల నుంచి సునీత‌ను భర్త సురేందర్, అత్త పీక్లి, అడపడుచు సంతోష అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టారు. ఈ వేధింపులు తాళలేక 2021 జనవరి 10వ తేదీన సునీత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

తాజాగా ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నిందితులను దోషులుగా తేల్చి, ముగ్గురికీ యావజ్జీవ జైలుశిక్షతో పాటు రూ.50వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
Suicide Case
Ranga Reddy District
Crime News

More Telugu News