Actress Gautami: రూ. 3 కోట్ల విలువైన గౌతమి భూమి కబ్జా.. న్యాయం జరిగే వరకు పోరాడతానన్న సినీ నటి

Actor Gautamis property fraud case Actress Said She Fight Until Justice Out
  • గౌతమి భూమి కబ్జా.. వేరొకరికి విక్రయం
  • నిందితులు ఏడాదిగా బెయిలుపైనే
  • మరోమారు బెయిలు పిటిషన్ పెట్టుకున్న నిందితులు
  • అభ్యంతరం వ్యక్తం చేసిన నటి తరపు లాయర్
ఓ భూ వ్యవహారంలో దారుణంగా మోసపోయిన సీనియర్ నటి గౌతమి తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. తమిళనాడులోని కారైక్కుడికి చెందిన అళగప్పన్.. రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలో గౌతమికి ఉన్న స్థలాన్ని కబ్జా చేసి, ఆపై నకిలీ పత్రాలు సృష్టించి వేరే వ్యక్తులకు విక్రయించాడు. దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని తన ప్రమేయం లేకుండా విక్రయించడంపై గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తనను మోసం చేసిన అళగప్పన్, ఆయన భార్య నాచ్చాళ్, కుమారుడు శివ, కోడలు ఆర్తి, బంధువులపై కేసులు పెట్టారు. ఏడాదిగా వారంతా బెయిలుపై ఉన్నారు. తాజాగా, నిందితులు మరోమారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది. గౌతమి తరపున హాజరైన న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ వారికి బెయిలు ఇవ్వకూడదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Actress Gautami
Land Fraud Case
Kollywood

More Telugu News