Mamata Banerjee: జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటన... విచారణపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్య

Mamata Banerjee Says Will Hand Over Doctor Rape Murder Probe
  • మృతురాలి ఇంటికి వెళ్లి పరామర్శించిన మమతా బెనర్జీ
  • ఆదివారం లోగా పోలీసులు పరిష్కరించకుంటే కేసును సీబీఐకి అప్పగిస్తామన్న మమతా బెనర్జీ
  • ఈ కేసులో మరింతమంది నిందితులు ఉంటే ఆదివారం లోగా అరెస్ట్ చేస్తామని వెల్లడి
జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును ఆదివారం నాటికి దర్యాఫ్తు చేయాలని, లేదంటే సీబీఐకి అప్పగిస్తామని పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు. ఈ కేసును పోలీసులు వారం రోజుల్లో పరిష్కరించాలన్నారు. లేదంటే సీబీఐకి అప్పగిస్తామన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఆమె డెడ్ లైన్ విధించారు.

మమతా బెనర్జీ ఈరోజు మృతురాలి ఇంటికి వెళ్లి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో మరింతమంది నిందితులు ఉంటే ఆదివారంలోగా అరెస్ట్ చేస్తామన్నారు. అప్పటి లోగా రాష్ట్ర పోలీసులు కేసును ఛేదించకుంటే కేంద్ర దర్యాఫ్తు సంస్థకు అప్పగిస్తామన్నారు. ఈ కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరగాలని కోరుకుంటున్నామన్నారు. ఇదే సమయంలో ఆమె సీబీఐ, ఈడీలపై విమర్శలు చేశారు. సీబీఐ విజయాల రేటు తక్కువగా ఉందన్నారు. చోరీకి గురైన రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి కేసును వాళ్లు ఇంకా పరిష్కరించలేదన్నారు.

కాగా, జూనియర్ డాక్టర్ పై హత్యాచార కేసులో ఒకరి కంటే ఎక్కువ మంది నేరానికి పాల్పడి ఉండొచ్చని, లేదా, వారు నిందితుడికి సహకరించి ఉండొచ్చని కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ అన్నారు. ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్నామన్నారు. అనుమానితుల గురించి తెలిసిన వైద్య విద్యార్థులు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం కోసం హెల్ప్ లైన్ నెంబర్‌ను కూడా ప్రారంభించామన్నారు.
Mamata Banerjee
West Bengal
Junior Doctor
CBI

More Telugu News