చిత్తూరు జిలాల్లో నాటు బాంబుల కలకలం
- పాకాల మండలంలో 26 నాటు బాంబుల స్వాధీనం
- నాటు బాంబులు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు
- అడవి పందుల వేటకే ఈ నాటుబాంబులని చెబుతున్న నిందితులు
పందుల పెంపకం, అడవి పందుల మాంసం విక్రయాలపై జీవనం సాగిస్తున్న తాము అడవి పందులను వేటాడటానికి నాటు బాంబులు తయారు చేస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. వారు తయారు చేసిన నాటు బాంబులను అడవి పందులు సంచరించే ప్రదేశాల్లో పెడితే అవి తినే ప్రయత్నం చేసినప్పుడు, అవి పేలి అడవి పంది గాయపడుతుంది. ఆ తర్వాత గాయపడిన పందిని వారు స్వాధీనం చేసుకుని, దాని మాంసాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులకు నిందితులు తెలిపారు. అయినప్పటికీ కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.