Harynana: గ్యారేజీలో భారీ అగ్ని ప్రమాదం .. రూ. 7 కోట్ల విలువైన కార్లు బుగ్గిపాలు

Fire Accident In Haryna
  • హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘటన
  • ప్రమాద సమయంలో సిబ్బంది లేకపోవడంతో తప్పిన ముప్పు
  • 16 లగ్జరీ కార్లు అగ్నికి ఆహుతి
  • షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక కార్ల వర్క్‌‌షాప్ (గ్యారేజీ)లో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 16 లగ్జరీ కార్లు దగ్ధమైయ్యాయి. వీటి విలువ దాదాపు రూ.7 కోట్ల వరకూ ఉంటుందని భావిస్తున్నారు. సెక్టార్ 41 ఏరియా మోతీ విహార్ ప్రాంతంలోని బెర్లిన్ మోటార్ వర్క్‌షాపులో నిన్న వేకువజామున మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే వర్క్‌షాపులో ఉన్న 16 లగ్జరీ కార్లతో పాటు కొన్ని పాత వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.  ఘటనపై పోలీసుల  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సెర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.  
Harynana
Car Garrage
Work Shop
Fire Accident

More Telugu News