రూ.91 రీఛార్జ్‌తో అదిరిపోయే ఆఫర్ అందిస్తున్న బీఎస్ఎన్ఎల్
- రూ. 91కి 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తున్న ప్రభుత్వరంగ కంపెనీ
- స్వల్ప ఛార్జీలతో కాలింగ్, ఎస్ఎంఎస్‌లు, డేటా ఉపయోగించుకునే ఛాన్స్
- సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునేవారికి బ్రహ్మాండమైన ప్లాన్
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లలో రూ.91 ప్లాన్ ఒకటిగా ఉంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులకు 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంత తక్కువ ధరలో ఇతర కంపెనీలేవీ ఈ స్థాయిలో వ్యాలిడిటీని అందించడం లేదు. తక్కువ ఖర్చుతో సిమ్‌ను ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారికి ఈ ప్లాన్ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్లాన్ కింద కాలింగ్‌కు 1 నిమిషానికి 15 పైసలు ఛార్జీ పడుతుంది. 1 ఎంబీ డేటాకు 1 పైగా, ఒక ఎస్ఎంఎస్‌కు 25 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. టాక్ టైమ్ వోచర్ లేదా డేటా వోచర్‌లతో ప్రత్యేకంగా రీఛార్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ధరల్లో ఈ కూపన్స్ అందుబాటులో ఉంటాయి.
రూ.107తో మరో ఆకర్షణీయమైన ఆఫర్..
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లలో రూ.107 ప్లాన్ ఒకటి. పరిమితమైన డేటా అవసరమైనవారికి ఈ ప్లాన్ బాగుంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 35 రోజులుగా ఉంది. యూజర్లు 200 కాలింగ్ నిమిషాలు పొందుతారు. ఇక పరిమితంగా 35 రోజుల వ్యాలిడిటీతో 3జీబీ పరిమిత డేటా లభిస్తుంది. తక్కువ డేటా అవసరమైన వారికి మాత్రమే ఈ ప్లాన్ ఉపయోగడుతుంది.