Tihar Jail Official: తుపాకీ పట్టుకుని డ్యాన్స్.. తిహార్ జైలు అధికారిపై వేటు!

Tihar jail official suspended after viral video shows him dancing with pistol
తుపాకీ పట్టుకుని డ్యాన్స్ చేసిన తిహార్ జైలు అధికారిపై తాజాగా వేటు పడింది. వైరల్‌గా మారిన ఆయన డ్యాన్స్ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సస్పెన్షన్ వేటు పడింది. పోలీసుల కథనం ప్రకారం, ఏఎస్పీ దీపక్ శర్మ తిహార్ జైలు పరిధిలోని మాండోలి కారాగారంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన డ్యాన్స్ వీడియో స్థానికంగా పెను కలకలం రేపింది. 

ఓ కార్యక్రమానికి హాజరైన దీపక్ శర్మ డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో రివాల్వర్‌ను చుట్టూ ఉన్న వారిపై గురిపెడుతున్నట్టు పోజు పెట్టి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో జైళ్ల శాఖ దృష్టికి వెళ్లింది. ఘటనను సమీక్షించిన ఉన్నతాధికారులు దీపక్ శర్మను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
Tihar Jail Official
Dancing with Pistol
Viral Videos
Suspension

More Telugu News