Shariff Mohammed Ahmed: క్రికెటర్ సిరాజ్‌కు జుబ్లీహిల్స్‌లో ఇంటిస్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు

Mohammed Siraj gets 600 sq yard plot in Jubilee Hills
  • టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సిరాజ్ సభ్యుడు
  • ఇటీవల సీఎంను కలిసిన మహమ్మద్ సిరాజ్
  • ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి
  • హైదరాబాద్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం
భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో సిరాజ్ సభ్యుడు. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం సిరాజ్ కు హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది.

ఇటీవల టీ20 ప్రపంచకప్ సాధించిన తర్వాత నగరానికి చేరుకున్న సిరాజ్ జుబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రికి టీమిండియా జెర్సీని బహూకరించారు. 

ఈ సందర్భంగా సిరాజ్‌కు ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం, తాజాగా ఇంటిస్థలం కేటాయిస్తూ జీవో జారీ చేశారు.
Shariff Mohammed Ahmed
Team India
Cricket
Revanth Reddy
Telangana

More Telugu News