CM Chandrababu: ఆదివాసీ మ‌హిళ‌ల‌తో కలిసి చంద్రబాబు నృత్యం... ఇదిగో వీడియో!

AP CM Chandrababu Dance with Adivasi on World Tribal Day 2024
  • ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్లిన సీఎం
  • గిరిజనులతో కలిసి కొద్దిసేపు థింసా నృత్యం చేసిన చంద్ర‌బాబు
  • డప్పు కొట్టి గిరిజనులను ఉత్సాహప‌రిచిన ముఖ్య‌మంత్రి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేళ గిరిజనులతో కలిసి సందడి చేశారు. ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్లారు. అక్క‌డ ఆయ‌న‌కు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజనులతో కలిసి చంద్రబాబు కొద్దిసేపు థింసా నృత్యం చేసి వారిని ఉత్సాహప‌రిచారు.

గిరిజనుల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. ఆ తర్వాత డప్పు కొట్టి గిరిజనులతో మ‌మేక‌మ‌య్యారు. వివిధ వేషధారణలతో వచ్చిన వారితో ముచ్చటించారు. గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలకు వెళ్లి, వాటిని పరిశీలించారు. అంత‌కుముందు అర‌కు కాఫీ తాగారు.
CM Chandrababu
Adivasi
Dance
World Tribal Day 2024
Andhra Pradesh

More Telugu News