Fahadh Faasil: ఇద్దరు సూపర్ స్టార్లతో బర్త్ డే బాయ్ ఫహాద్ ఫాజిల్... ఫొటో ఇదిగో!

FahadH Faasil birthday special pic
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఫహాద్ ఫాజిల్ ఒకరు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఫాజిల్ నటనా విశ్వరూపం ఎలాంటిదో  పుష్ప చిత్రంలో అందరూ చూశారు. పుష్ప చిత్రంలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ గా కనిపించింది చివర్లో కొంత సేపే అయినా తన యాక్టింగ్ టాలెంట్ ను 360 డిగ్రీస్ లో చూపించాడు. పుష్ప-2లో ఫుల్ లెంగ్త్ రోల్ తో విశ్వరూపం ప్రదర్శించనున్నాడు. 

తాజాగా రజనీకాంత్ నటిస్తున్న వేట్టయాన్ లో ఫహాద్ ఫాజిల్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక అసలు విషయానికొస్తే... నేడు (ఆగస్టు 8) ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా వేట్టయాన్ మేకర్స్ ఒక ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. బర్త్ డే బాయ్ ఫాజిల్ ఇద్దరు సూపర్ స్టార్లు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ లతో కలిసి ఉన్న ఫొటోను చిత్రబృందం షేర్ చేసింది. ఈ పిక్ ను వేట్టయాన్ సెట్స్ పై క్లిక్ మనిపించారు.
Fahadh Faasil
Birthday
Special
Pic

More Telugu News