Telangana: సీఎం గారూ... కువైట్‌లో నన్ను కొడుతున్నారు... కాపాడండి: రేవంత్ రెడ్డికి నిర్మల్ వాసి విజ్ఞప్తి

Telangana kuwait victim released a video
  • సీఎంకు మొరపెట్టుకున్న ముథోల్ మండలం రువ్వి గ్రామవాసి
  • తనను స్వదేశానికి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • తనను ఏజెంట్ మోసం చేశాడన్న రాథోడ్ నాందేవ్
కువైట్‌లో తనను కొడుతున్నారని, తీవ్ర అవస్థలు పడుతున్నానని... తనను స్వదేశానికి తీసుకువెళ్లండని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మల్ జిల్లాకు చెందిన రాథోడ్ నాందేవ్ మొరపెట్టుకున్నాడు. ఈ మేరకు ఓ వీడియో చిత్రీకరించి పోస్ట్ చేశాడు. తనను స్వదేశానికి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరాడు.

ముథోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ పది నెలల క్రితం కువైట్ వెళ్లాడు. ఇంట్లో పని అని చెప్పి ఓ ఏజెంట్ తనను కువైట్ పంపించినట్లు చెప్పాడు. కానీ కువైట్ చేరుకున్నాక తనను మోసం చేసినట్లు తెలిసిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఎడారిలో ఒంటెల కాపరిగా పని చేస్తున్నానని, తనను కొడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఇక్కడి నుంచి తీసుకువెళ్లేలా చూడాలని కోరాడు.
Telangana
Revanth Reddy
Kuwait

More Telugu News