Tim Walz: డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఎంపిక

Minnesota Governor Tim Walz Picked as Democratic Vice Presidential Nominee
  • వెస్ట్ పాయింట్ కు చెందిన చిన్న పట్టణం నెబ్రస్కాలో పెరిగిన వాల్జ్ 
  • ఆర్మీ నేషనల్ గార్డ్ గా 24 ఏళ్లు, చట్ట సభలో 12 ఏళ్లు సేవలందించిన వాల్జ్ 
  • అధ్యక్ష అభ్యర్ధిగా అధికారికంగా హారిస్ ఖరారు .. అనుకూలంగా 99 శాతం ఓట్లు
వచ్చే నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సంరంభం ఊపందుకుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో   డెమోక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్ధిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఎంపిక అయ్యారు. అధ్యక్ష రేసులో ఉన్న కమలా హారిస్ తాజాగా వాల్ట్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై డెమోక్రటిక్ పార్టీ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
 
వెస్ట్ పాయింట్ కు చెందిన చిన్న పట్టణం నెబ్రస్కాలో పెరిగిన వాల్జ్ సామాజిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా, ఫుట్ బాల్ కోచ్ గా పని చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు వరకూ మిన్నెసొటాలోని మంకాటో వెస్ట్ హైస్కూల్ యూనియన్ మెంబర్ గా వ్యవహరించారు. మిన్నెసొటా జిల్లా నుంచి 2006లో తొలిసారి కాంగ్రెస్ కు ఎన్నికయ్యారు. అమెరికా చట్ట సభలో 12 ఏళ్ల పాటు సేవలు అందించిన వాల్జ్ .. 2018 లో మిన్నెసొటా గవర్నర్ గా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ పార్టీని ఎండగట్టడంలో తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించిన వాల్జ్  .. ఆర్మీ నేషనల్ గార్డ్ లో 24 ఏళ్లు పని చేశారు. ఆయన ఎంపిక ద్వారా దేశ పశ్చిమ మధయ్ ప్రాంతంలో డెమోక్రటిక్ పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు.
 
కాగా, డెమోక్రటిక్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్ లాంఛనంగా ఖరారు అయ్యారు. హారిస్ నామినేషన్ సోమవారం రాత్రి అధికారికమైంది. ఆమెకు అనుకూలంగా 99 శాతం మంది పార్టీ ప్రతినిధుల ఓట్లు లభించాయి. దేశ వ్యాప్తంగా సుమారు 4,567 మంది హారిస్ ను బలపరుస్తూ ఓటు వేశారు.
Tim Walz
Democratic Vice Presidential Nominee
USA

More Telugu News