Nadendla Manohar: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు

Civil Supplies Minister Nadendla Manohar key orders
  • రేషన్ బియ్యం అక్రమ రవాణా నిరోధానికి కాకినాడ – ముంబయి రోడ్డులో చెక్ పోస్టుల ఏర్పాటు
  • ఒకే రోజు ఆరు లారీల్లో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు
  • కాకినాడ పోర్టు పీఎస్ వద్ద మరో చెక్ పోస్టు ఏర్పాటు చేయాలని ఆదేశించిన మంత్రి నాదెండ్ల మనోహర్
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం ఇతర దేశాలకు రవాణా అవుతున్నట్లుగా గుర్తించారు. కాకినాడలో గోడౌన్ లలో పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేయించారు.
 
కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఎనిమిది విభాగాల పర్యవేక్షణలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుండి ముంబయి రోడ్డులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొన్న ఒక్క రోజునే ఆరు లారీల్లో బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ పోర్టు పీఎస్ వద్ద మరో చెక్ పోస్టు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ పోర్టు మార్గంలో అన్ని లారీలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ అడ్డాగా రేషన్ మాఫియా దందా సాగిస్తోందని ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
Nadendla Manohar
Minister
civil supplies
Andhra Pradesh

More Telugu News