Nara Lokesh: కనక పుట్లమ్మ ఆలయంలో మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక పూజలు

AP Minister Nara Lokesh offers prayers in Kanaka Putlamma temple
 
ఏపీ మంత్రి నారా లోకేశ్ నేడు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పెదకొండూరులో పర్యటించారు. ఇక్కడి కనక పుట్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మంత్రి లోకేశ్ కు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అన్ని హామీలను ప్రాధాన్యతా క్రమంలో నెరవేరుస్తామని తెలిపారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
Nara Lokesh
Kanaka Putlamma Temple
Pedakonduru
Mangalagiri

More Telugu News