KTR: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్‌ సార్‌ తన జీవితాన్ని ధారబోశారు: కేటీఆర్‌

KTR Tweet on Birth Anniversary of Professor Jayashankar Sir
  • నేడు ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ జయంతి
  • జయశంకర్‌ సార్‌కు ఎక్స్ ద్వారా కేటీఆర్ ఘ‌న నివాళి
  • స్వరాష్ట్ర సాధనలో దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమన్న కేటీఆర్‌
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ జయంతి సందర్భంగా ఆయనకు కేటీఆర్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్‌ సార్‌ తన జీవితాన్ని ధారబోసారని కేటీఆర్‌ అన్నారు. స్వరాష్ట్ర సాధనలో దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమని, స్ఫూర్తి మరచిపోలేనిదని కొనియాడారు. పుట్టుక మీది.. చావు మీది.. బతుకంతా తెలంగాణది అని కీర్తించారు. 

‘‘పుట్టుక మీది.. చావు మీది.. బ్రతుకంతా తెలంగాణది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మా ఘన నివాళులు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన కృషి అనిర్వచనీయం. స్వరాష్ట్ర సాధనలో ఒక దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమైనది.. వారి స్ఫూర్తి మరిచిపోలేనిది. సార్ అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్ర పోరాటం.. తెలంగాణ ప్రగతి ప్రస్థానం. జోహార్ జయశంకర్ సార్! జై తెలంగాణ’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.
KTR
Professor Jayashankar Sir
Birth Anniversary
Telangana

More Telugu News