Tata Play: సోనీ చానళ్లను ప్యాకేజి నుంచి తొలగిస్తున్న టాటా ప్లే... నోటీసులు ఇవ్వకుండానే తొలగిస్తోందన్న సోనీ ఇండియా

Rift continues between Tata Play and Sony Pictures Network India
 
ప్రముఖ డీటీహెచ్ సంస్థ టాటా ప్లే, సోనియా ఇండియా నెట్ వర్క్ మధ్య వివాదం కొనసాగుతోంది. సోనీ నెట్ వర్క్ కు చెందిన పలు చానళ్లను టాటా ప్లే తన ప్యాకేజి నుంచి తొలగిస్తుండగా, టాటా ప్లే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే చానళ్లను తొలగిస్తోందంటూ సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) ఆరోపిస్తోంది. 

సోనీ నెట్ వర్క్ కు చెందిన చానళ్లకు ప్రజాదరణ తగ్గుతోందని, వాటి వ్యూయర్ షిప్ లో క్షీణత కనిపిస్తోందని టాటా ప్లే చెబుతోంది. అందువల్లే ఆయా చానళ్లను తొలగిస్తున్నామని, తద్వారా వినియోగదారులకు రూ.50 నుంచి రూ.60 వరకు ఆదా అవుతుందని వెల్లడించింది. 

అయితే, తమ చానళ్లకు వ్యూయర్ షిప్ తగ్గుతోందన్న టాటా ప్లే వాదనలను ఎస్పీఎన్ఐ కొట్టిపడేసింది. ఇది తప్పుదోవ పట్టించే యత్నమేనని స్పష్టం చేసింది. టాటా ప్లే సబ్ స్క్రైబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను ఆడిటింగ్ చేయించాలని తాము విజ్ఞప్తి చేశామని, అందుకు ప్రతిగానే టాటా ప్లే తమ చానళ్ల తొలగింపు చర్యలు చేపట్టిందని ఆరోపించింది.
Tata Play
Sony Pictures Network India
Channels
DTH

More Telugu News