మాజీ సీజేఐ ఎన్వీ రమణను కలిసిన మంద కృష్ణ మాదిగ
- ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు
- మాదిగల్లో హర్షం
- నాడు ఎస్సీ వర్గీకరణ కేసుకు సుప్రీంకోర్టులో విచారణకు అనుమతించిన ఎన్వీ రమణ
- నేడు ఎన్వీ రమణను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంద కృష్ణ
ఎన్వీ రమణ సీజేఐగా ఉన్న సమయంలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ వ్యవహారం విచారణకు వచ్చింది. పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును విచారణకు అనుమతించిన జస్టిస్ ఎన్వీ రమణ, ఆ కేసును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి సిఫారసు చేశారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశంపై పలు దఫాలు విచారణ జరిగింది.
ఎన్వీ రమణ అప్పట్లోనే పదవీవిరమణ చేయగా... కొన్ని రోజుల కిందటే సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకోవచ్చంటూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో... ఎస్సీ వర్గీకరణ కేసును సుప్రీంకోర్టులో విచారణకు అనుమతించినందుకు నేడు మంద కృష్ణ జస్టిస్ ఎన్వీ రమణను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ, ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమించిన మంద కృష్ణ మాదిగ బృందాన్ని అభినందించారు.