YS Jagan: పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయించుకున్న మాజీ సీఎం జగన్

YS Jagan couple went for passport office of their passport renewal
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో తన భార్య వైఎస్ భారతితో కలిసి విజయవాడ బందరు రోడ్డులోని పాస్‌పోర్టు ఆఫీస్‌కు ఆయన వెళ్లారు. రెన్యువల్ ప్రక్రియ ముగిసిన అనంతరం 5.50 గంటల సమయంలో అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. నేరుగా తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు.

కాగా వైస్ జగన్ వెంట పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రఘురాం, మాజీ ఎంపీ సురేశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్, ఇతర నాయకులు ఉన్నారు. కాగా పాస్‌పోర్ట్ కార్యాలయానికి ఆయన వచ్చిన సమయంలో బందరు రోడ్డులో కొద్దిసేపు ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడింది.
YS Jagan
YS Bharati
YSRCP
Vijayawada

More Telugu News