Kuppam: సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కుప్పం వైసీపీ నేతలు

Kuppam YCP leaders joins TDP
  • ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరిక
  • అందరికీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
  • కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శ్రీకాంత్
  • కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్న నేతలు 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కుప్పం వైసీపీ నేతలు నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీ సభ్యులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పిన చంద్రబాబు టీడీపీలోకి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా టీడీపీలో చేరిన కుప్పం నేతలు మాట్లాడుతూ, కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. వైనాట్ 175 అన్నారు... కుప్పంలో రౌడీయిజాన్ని పెంచి పోషించారు.... కుప్పంను సర్వనాశనం చేశారు అంటూ వారు ధ్వజమెత్తారు. 

కుప్పం నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు పట్ల వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు కారణంగా ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చిందని వివరించారు.

ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ, త్వరలోనే మరికొందరు కుప్పం వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరుతున్నారని వెల్లడించారు.
Kuppam
Chandrababu
TDP
YSRCP

More Telugu News